యాప్నగరం

మక్కా మసీదులో శనివారం నుంచి ప్రార్థనలు.. వారికి అనుమతి లేదు

ఆరు నెలలుగా ప్రార్థనామందిరాలు అన్ని మూతపడిన విషయం తెలిసిందే. నిత్యం నమాజులు జరిగే మక్కా మసీదు సైతం మూగబోయింది. అయితే రంజాన్, బక్రీద్ ప్రార్థనలకు కూడా ఈ మసీదు తెరవలేదు.

Samayam Telugu 3 Sep 2020, 3:59 pm
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. ఆలయాలు, మసీదులు చర్జీల్లో ప్రార్థనలకు అనుమతి నిరాకరించారు. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్క మసీదు కానీ, ప్రార్థనా మందిరం కాని తెరుచుకోలేదు. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైనకానుంచి కేంద్రం ఒక్కో విషయంలో సడలింపులు ఇచ్చుకుంటూ పోతుంది. తాజాగా హైదరాబాద్‌లో చారిత్రాత్మక మక్కా మసీదులో శనివారం నుండి ప్రార్థనలకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతించారు. మొదటి 15 రోజుల్లో 50 మందికి మాత్రమే ప్రార్థనలకు అనుమతిస్తారు. అనంతరం 100 మందికి అనుమతి ఉంటుంది.
Samayam Telugu మక్కా మసీదు
mecca masjid


తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో బుధవారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం, ఎఐఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో పాతబస్తీలో ఉండే మక్కా మసీదు దాదాపు ఆరు నెలలుగా మూసివేయబడింది. కేర్ టేకర్స్, మేనేజింగ్ సిబ్బంది మాత్రమే ప్రార్థనలకు హాజరవుతున్నారు.
రంజాన్, బక్రీద్ ప్రార్థనలకు సైతం మసీదులోకి అనుమతించలేదు.

Read More: వాహనదారులకు శుభవార్త.. ఇక ఆన్ లైన్లోనే డ్రైవింగ్ లైెసెన్స్ రెన్యువల్

కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరిస్తూ, భౌతికదూరాన్ని పాటిస్తూ మసీదులో ప్రార్థనలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం. మసీదు ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తున్నామన్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రార్థనల కోసం స్థలాలను మార్క్ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం నుండి 50 మంది చొప్పున అదేవిధంగా ఈ నెల 21 నుండి 100 చొప్పున ప్రార్థనలకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలోపు చిన్నారులను, 60 ఏళ్ల పైబడిన వ్యక్తులను ప్రార్థనలకు అనుమతించేదిలేదన్నారు. నమాజ్‌లో పాల్గొనే వ్యక్తులు సొంత మ్యాట్లు తెచ్చుకోవాల్సిందిగా సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.