యాప్నగరం

హైదరాబాద్: అకాల వర్షాలపై వాతావరణ అధికారుల కీలక ప్రకటన

Meteorology department: ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులు వీస్తుండడంతో రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా బాగా పెరిగిందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ చలికి శీతకాలంలోని చలికి చాలా తేడా ఉందని చెప్పారు.

Samayam Telugu 9 Feb 2020, 9:08 pm
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ అకాల వర్షాలేంటని అంతా ఆశ్చర్యపోతున్న నేపథ్యంలో దీనిపై వాతావరణ అధికారులు వివరణ ఇచ్చారు. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని వెల్లడించారు. ఇది కాక మరో ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉందని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో ఎక్కువగా చలి ఉంటోందని, ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu Rains in Hyd


ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులు వీస్తుండడంతో రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా బాగా పెరిగిందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ చలికి శీతకాలంలోని చలికి చాలా తేడా ఉందని చెప్పారు. శీతకాలంలో మంచు కురవడం వల్ల చలి ఏర్పడుతుందని, ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులు వీస్తుండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గినట్లుగా అనిపిస్తోందని వివరించారు.

శని, ఆదివారాలతో పోలిస్తే రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ అధికారి వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. మరోవైపు, ఒడిషా మీదుగా ఒక ద్రోణి ఆవరించి ఉన్నందున ఏపీలోని ఉత్తర కోస్తాలో వానలు పడే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.