యాప్నగరం

New Year 2020: మద్యం ప్రియులకు మెట్రో ఆఫర్.. ఒంటి గంట వరకూ రైళ్లు

New Year 2020 వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ఆఫర్ ఇచ్చింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. మద్యం తాగిన వారిని కూడా అనుమతించనుండటం విశేషం.

Samayam Telugu 30 Dec 2019, 5:45 pm
ద్యం ప్రియులకు హైదరాబాద్ మెట్రో డిసెంబర్ 31 ఆఫర్ ఇచ్చింది. మద్యం సేవించి మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చని తెలిపింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని అర్ధరాత్రి ఒంటి గంట వరకూ రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం (డిసెంబర్ 30) తెలిపారు. మెట్రో ప్రత్యేక సర్వీసులు అన్ని స్టేషన్లలోనూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మందు బాబులకు ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించనుంది. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించి.. ఇంటి కెళ్లడానికి తిప్పలు పడకుండా ఊరటనిచ్చింది.
Samayam Telugu మెట్రో రైలు


ఏటా డిసెంబర్ 31 సందర్భంగా లెక్కకు మిక్కిలి మద్యంప్రియులు ఫూటుగా తాగి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు. వీరిలో మహిళలు, సెలబ్రిటీలు కూడా అధికంగా ఉంటున్నారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులతో వీరంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. అయితే.. మద్యం తాగి మెట్రో రైళ్లలో వీరంగం చేస్తే ఎలా అనే సంశయం కూడా నెలకొంది. దీనికి మెట్రో అధికారులు స్పష్టత ఇచ్చారు.

Also Read: మంచి మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు..

మద్యం తాగినవారినీ మెట్రో రైళ్లకు అనుమతిస్తామని.. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే ఈ అవకాశం కల్పిస్తామని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. మద్యం తాగి మెట్రో రైళ్లలో వీరంగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అర్ధరాత్రి వరకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1.30 వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు ఉంటాయని తెలిపారు. అర్ధరాత్రి 1.30 గంటలకు లింగంపల్లి - ఫలక్‌నుమా, 1.15 గంటలకు లింగంపల్లి - హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.

Don't Miss: అదే మంచి పెట్టుబడి.. ‘పది’ విద్యార్థుల పేరెంట్స్‌కు హరీశ్ రావు కీలక సూచన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.