యాప్నగరం

హైదరాబాదీలకు పోలీసుల అలర్ట్! తేడా వస్తే జైలుకే.. సీపీ ట్వీట్

Hyderabad CP: స్పష్టంగా కనిపించేలా ఉంచకపోతే వారిని గొలుసు దొంగతనాలు చేసే వ్యక్తిగా (చైన్ స్నాచర్) అనుమానిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు.

Samayam Telugu 12 Mar 2020, 3:22 pm
హైదరాబాద్‌లోని వాహనదారులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. వాహనదారులు నంబరు ప్లేటును స్పష్టంగా కనిపించేలా ఉంచకపోతే వారిని గొలుసు దొంగతనాలు చేసే వ్యక్తిగా (చైన్ స్నాచర్) అనుమానిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు.
Samayam Telugu Hyd CP Anjani Kumar


Also Read: బాలుడి మాస్టర్ ప్లాన్.. చదువులో పోటీ అని తోటి విద్యార్థిని చంపి.. అదిరే ట్విస్ట్!

తమ వద్ద తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు 2 వేల వాహనాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని అంజనీ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సరిగ్గా లేని నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 384 మంది వాహనదారులపై మంగళవారం కేసులు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే ఫొటోను తీసి 9490616555 నెంబరుకు వాట్సాప్ చేయాలని నగర పౌరులను సీపీ ట్విట్టర్‌లో కోరారు.

Must Read: ఇటలీ: తిండిలేక తెలంగాణ విద్యార్థుల అవస్థలు.. స్పందించిన కేటీఆర్.. వీడియో

సాధారణంగా తరచూ రోడ్డు భద్రతా నిబంధనలు అతిక్రమించేవారు.. తమ నెంబరు ప్లేటు కనిపించకుండా ఒంపడం లేదా అక్షరాలు స్పష్టంగా కనిపించకుండా గీకడం వంటివి చేస్తుంటారు. మరికొందరు నకిలీ నంబరు ప్లేట్లతో తిరుగుతుంటారు. దీనివల్ల ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీసినా చలానాలు తమకు రావని చాలా మంది ఇలా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా హెచ్చరిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: రేవంత్ రెడ్డి ఒక్కడే మగాడా.. తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతల ఫైర్

Also Read: జగిత్యాల: మెట్‌పల్లికి జమ్ము కశ్మీర్ పోలీసులు హల్ చల్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.