యాప్నగరం

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు.. పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు

Moghalpura: బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీపై చర్యలు తీసుకోవాలని దిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 13 Mar 2020, 1:22 pm
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేసినట్లుగా హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోకి ఓ సభలో అసద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి ఓ వర్గం వారిని రెచ్చగొట్టేవిగా ఉన్నందునే ఈ కేసును నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఒవైసీతోపాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపైనా కేసు నమోదైంది.
Samayam Telugu Asaduddin Owaisi


బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీపై చర్యలు తీసుకోవాలని దిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఇందిరాపార్క్ వద్ద టీచర్ల ఆందోళన.. చెదరగొట్టిన పోలీసులు, అరెస్టు

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్, భారత్, పాకిస్థాన్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Also Read: విమానం నడిపిన మంత్రి కేటీఆర్..! వీడియో

Also Read: లేగ దూడపై అత్యాచార యత్నం.. హైదరాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.