యాప్నగరం

ఆకర్షించే చాక్లెట్లు.. కానీ, మామూలువి కాదు!

Hyderabad నగరంలో గుట్టుగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చాక్లెట్లలో గంజాయి ఉంచి అమ్ముతున్నారు.

Samayam Telugu 29 Feb 2020, 11:47 pm
చూడగానే నోరూరించే చాక్లెట్లు.. కానీ, అవి మామూలు చాక్లెట్లు కాదు. ఆ రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం బాలానగర్‌లో శనివారం (ఫిబ్రవరి 29) వెలుగులోకి వచ్చింది. చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్, ఫతే నగర్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Samayam Telugu Ganja Chocolates


పోలీసులు పక్కా సమాచారంతో ఆయా ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీ చేశారు. తనిఖీల్లో 228 గంజాయి చాక్లెట్లు లభించినట్లు ఎక్సైజ్ సీఐ జీవన్ కిరణ్ తెలిపారు. వీటిలో మొత్తం 1.2 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. జయంత్ ప్రధాన్ (41) అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన ఆకాష్ దాస్ అనే మరో వ్యక్తితో కలిసి అతడు ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

Also Read: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో కుళ్లిన స్థితిలో మృతదేహం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.