యాప్నగరం

గర్భిణిని ఆదుకున్న డయల్ 100.. పోలీసులకు హ్యాట్సాఫ్

Telangana Lockdown వేళ పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను డయల్ 100 ఆదుకుంది. పోలీసులు సకాలంలో స్పందించి గర్భిణిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 6 Apr 2020, 6:46 pm
పోలీసులు సకాలంలో స్పందించడంతో ఓ గర్భిణికి ప్రాణాపాయం తప్పింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో లాక్‌డౌన్ వేళ ఆందోళన చెందిన ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. సకాలంలో స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. స్థానికులు పోలీసులకు జేజేలు పలికారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో సోమవారం (ఏప్రిల్ 6) ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu delivery


బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. లాక్‌డౌన్ వేళ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చేసేదేంలేక మహిళ సోదరుడు అంజి డయల్ 100కు కాల్ చేశాడు. పరిస్థితిని వివరించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఉపేందర్ సమయస్ఫూర్తితో స్పందించారు. వెంటనే 108 వాహనంతో పాటు పోలీస్ పెట్రోల్ వాహనాన్ని ఘటనా స్థలికి తీసుకొని వెళ్లారు.

పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ.. ఆ అవస్థలు భరించలేక ఆర్తనాదాలు చేస్తున్న మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పోలీసులు చేసిన సాయానికి ఆ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

Also Read: కరోనా కాఠిన్యం: అమ్మ లేదని తెలిసినా వెళ్లలేని దైన్యం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.