యాప్నగరం

Disha Case: NHRCకి పోలీసుల నివేదిక..

గాంధీ ఆస్పత్రి మార్చురీలో నిందితుల శవాలను భద్రపరిచేందుకు నాలుగు ఫ్రీజర్ బాక్సులను వైద్య సిబ్బంది సిద్ధం చేశారు. భద్రతా కారణాల రీత్యా అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.

Samayam Telugu 10 Dec 2019, 1:51 pm
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య కేసులో నివేదికను పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఇందులో దిశను బలవంతంగా లాక్కెళ్లడం, అత్యాచారం, సజీవ దహనం వంటి వివరాలను వివరంగా పొందుపర్చారు. మరోవైపు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణ మొదలు పెట్టింది. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలోని కమిటీ ఎన్‌కౌంటర్ ఘటనపై క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తోంది.
Samayam Telugu mortury3.


మృత దేహాలు గాంధీకి తరలింపు
దిశ హత్యాచార కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు యువకుల మృత దేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహబూబ్‌నగర్ నుంచి వారి మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీ ఆస్పత్రి శవాగారంలో భద్రపరిచేందుకు నాలుగు ఫ్రీజర్ బాక్సులను కూడా వైద్య సిబ్బంది సిద్ధం చేశారు. భద్రతా కారణాల రీత్యా అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని మార్చురీలో 7, 8, 9, 10 నెంబర్లు గల బాక్సుల్లో నిందితుల శవాలను భద్రపర్చారు. ఈ మేరకు గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Disha హత్యాచార నిందితుల్లో ఇద్దరు మైనర్లు..! కానీ..undefined అయితే, తమ పిల్లలు చనిపోయారని తెలిసినప్పటి నుంచి తమకు కంటిమీద కునుకు లేదని నిందితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లలు చేసింది తప్పే అయినా శిక్ష పడి జైలులో ఉంటారనుకున్నామని, అర్ధాంతరంగా చనిపోతారని అనుకోలేదని అన్నారు. మృత దేహాలను తమకు అప్పగిస్తారని ఎదురు చూసిన వారికి సోమవారం హైకోర్టు తీర్పుతో నిరాశే ఎదురైంది. మరోవైపు నిందితుల గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
Also Read: 50 ఎకరాలు అమ్ముకున్న తెలంగాణ మంత్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.