యాప్నగరం

హైదరాబాద్: చర్లపల్లి జైలు దగ్గర భారీ బందోబస్తు

వెటర్నరీ డాక్టర్ హత్యకేసు నిందితులు ఉన్న చర్లపల్లి జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు. జైలు దగ్గర ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు.

Samayam Telugu 3 Dec 2019, 11:08 am
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ హత్యకేసు నిందితులు ఉన్న హైదరాబాద్ చర్లపల్లి జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెలక్షన్ అమలు విధించారు. జైలు దగ్గర ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నిందితుల భద్రత.. జైలు దగ్గర రెండు రోజులుగా ఆందోళనలు, నిరసనలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu charlapalli.


అంతేకాదు నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలని శంషాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే.. నిందితుల్ని తరలించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైనా పోలీసులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది. నేడు విచారణకు రావడంతో ఉత్కంఠ రేపుతోంది. పిటిషన్‌లో దిశ మొబైల్‌ రికవరీ చేయాలని, నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే దిశ హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళా, ప్రజా సంఘాలు నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నాయి. నిందితుల్ని వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే చట్టాల్లో మార్పులు తేవాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.