యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కలు పసికందును పీక్కుతిన్నాయి. ఈ ఘటన బంజారహిల్స్‌లో చోటు చేసుకుంది.

Samayam Telugu 29 Sep 2019, 6:02 pm
తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రించాల్సిన పసికందును వీధి కుక్కలు పీక్కుతిన్న ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనమైంది. గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 13లో నాలుగు నెలల వయసున్న చిన్నారిని రోడ్డు మీదే వదిలేసి వెళ్లారు. దీంతో ఆ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి గాయపర్చాయి. అర్ధరాత్రి పూట శునకాల అరుపులు వినడంతో.. ఏం జరుగుతుందో చూద్దామని అలీ గగ్గార్ అనే ప్రయివేట్ ఉద్యోగి ఇంట్లో నుంచి బయటకొచ్చాడు.
Samayam Telugu stray dogs


ఆయన వచ్చేసరికి వీధికుక్కలు చిన్నారి పీక్కుతింటున్నాయి. అలీ అక్కడికి వెళ్లే సరికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. శునకాల దాడిలో చిధ్రమైన చిన్నారి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ చిన్నారి ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నగరంలో వీధికుక్కల సమస్య తీవ్రంగా ఉంది. దీంతో జీఎహెచ్ఎంసీ అధికారులు 150 వీధికుక్కలను చంపేశారు. కాగా జంతు ప్రేమికులు జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.