యాప్నగరం

సెక్స్ సామర్థ్యం పెంచుతుందని హైదరాబాద్‌లో డ్రగ్స్.. కొత్తరకం అంటూ అమ్మకాలు

Hyderabad Police: నిందితులు ఈ డ్రగ్స్‌కు మరో రకంగా ప్రచారం కల్పిస్తూ అమ్ముతుండడం గమనార్హం. ఈ డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ విక్రయాలు చేపట్టారు.

Samayam Telugu 19 Nov 2020, 7:17 pm
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత జరిగింది. ఒక ముఠా ముంబయి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నారు. డబ్బున్నవారిని టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ముఠా పబ్బుల్లో పరిచయాలు పెంచుకొని డ్రగ్స్ సరఫరాను చాలా విస్తరింప చేశారు. గురువారం డ్రగ్స్ విక్రయిస్తున్న వీరిని నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Samayam Telugu డ్రగ్స్ ముఠా
police arrests drugs


అయితే, నిందితులు ఈ డ్రగ్స్‌కు మరో రకంగా ప్రచారం కల్పిస్తూ అమ్ముతుండడం గమనార్హం. ఈ డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ విక్రయాలు చేపట్టారు. వీరి వద్ద నుంచి 200 గ్రాముల మత్తు మందు మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు ప్రముఖ హోటల్లో పనిచేసిన చెఫ్ సలీం ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు టెలీ మార్కెటింగ్ చేస్తున్న వారితో పరిచయం చేసుకుని ఈ ముగ్గురు కలిసి పబ్బులకు వచ్చే వాళ్ళను ఆకర్షించేవారని తెలుస్తోంది. ఇలా పలు విధాలుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్మకాలు జరిపారు. ముంబయి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో ఈ ముఠా విక్రయిస్తోంది.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.