యాప్నగరం

GHMC Mayor: ఈసారి మేయర్ పదవి మహిళకే

రేపట్నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు.అయితే ఈసారి గ్రేటర్ మేయర్ పదవి మహిళలకే అవకాశం ఇస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది.

Samayam Telugu 17 Nov 2020, 12:53 pm
జీహెచ్ఎంసీ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. డిసెంబర్ 1న పోలింగ్, 4న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. చాలామంది హైదరాబాద్‌లో నివసించాలని కోరుకుంటారన్నారు. అయితే ఈసారి జరిగే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పదవికి మహిళలకు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. జనరల్ కేటగిరి మహిళకు మేయర్‌గా అవకాశం ఇస్తామన్నారు. ఈ నిర్ణయంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపట్నుంచి ఎన్నికల కోసం నామినేషన్లను స్వీకరిస్తున్నామన్నారు. ఎన్నికల నామినేషన్లు దాఖలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.
Samayam Telugu గ్రేటర్ మేయర్‌గా మహిళ
ghmc woman mayor


అభ్యర్థులు తమతమ నామినేషన్లను నేరుగా ఆర్వోకి సమర్పించాలన్నారు. షెడ్యూల్, నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1439గా గుర్తించారు అధికారులు. హైపర్ సెన్సిటివ్ కేంద్రాలు 1004గా, క్రిటికల్ కేంద్రాలు 257గా ఉన్నాయని తెలిపారు. అన్ని కలుపుకొని మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 2700 ఉన్నాయన్నారు. అయితే ఈ ఎన్నికల నామినేషన్ చివరి గడువు 20కాగా 22న ఉపసంహరణ గడువు ముగుస్తుంది.ఇప్పటికే 150 వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు అధికారులు.

Read More: GHMC Elections: డిసెంబర్1న పోలింగ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజకీయ పార్టీల అభిప్రాయాలను, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ ఉంటుంది అని సూచించారు. ఈ ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తాం అని తెలిపారు. అయితే ఈసారి మేయర్ పదవికి మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ షెడ్యూల్ విడుదల కావడంతో అటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు అభ్యర్థులపై దృష్టిపెట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.