యాప్నగరం

లాక్ డౌన్ 50 రోజుల్లో ఉల్లంఘనల కేసులు తెలిస్తే షాక్

Lockdown Violations: మార్చి 23వ తేదీ నుంచి సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టారు. కొందరి వాహనాలను కూడా సీజ్ చేశారు. ఇలా మే 13వ తేదీ వరకు ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టుల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

Samayam Telugu 14 May 2020, 11:24 pm
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ దాదాపు మార్చి మూడో వారం నుంచి అమలవుతోంది. కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలంతా తాము సూచించిన నిబంధనలు పాటించాలని లేదంటే, కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అయినా, చాలా మంది రోజూ వాహనాలపై తిరుగుతూ లాక్ డౌన్ ఉల్లంఘనలకు తూట్లు పొడిచారు. అత్యవసర పనులకు పోలీసులు మినహాయింపునిచ్చినా.. చాలా మంది అనవసరంగా రోడ్లపైకి వచ్చి పోలీసులకు చిక్కారు. ఇలాంటి వారిపై వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


Also Read: undefined

మార్చి 23వ తేదీ నుంచి సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టారు. కొందరి వాహనాలను కూడా సీజ్ చేశారు. ఇలా మే 13వ తేదీ వరకు ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టుల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినవారి సంఖ్య 9 లక్షలు దాటింది. ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 20,591 వాహనాలను సీజ్‌ చేయగా.. వీటిలో 16 వేల వరకు ద్విచక్రవాహనాలు ఉన్నాయి. 1,401 త్రిచక్ర వాహనాలు, 2,246 ఫోర్‌ వీలర్లు, 144 ఇతర వాహనాలు ఉన్నాయి. లాక్ డౌన్ అమలు చేయడం మొదలు పెట్టిన నాటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ట్రాఫిక్ పోలీసులు 9,15,182 కేసులు నమోదు చేశారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.