యాప్నగరం

సలాం పోలీస్.. గ్రీన్ కారిడార్‌తో గుండె తరలింపు సక్సెస్

ఒక వ్యక్తి గుండెను మరోక వ్యక్తికి అమర్చడానికి పోలీసులు బుధవారం నగరంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. కొద్ది నిమిషాలపాటు, ట్రాఫిక్ నిలిపివేసి, గుండెను విజయవంతంగా తరలించారు.

Samayam Telugu 28 Aug 2019, 1:12 pm
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి అమర్చాడానికి హైదరాబాద్ పోలీసులు బుధవారం నగరంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. కొద్ది నిమిషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేసి, గుండెను క్షణాల్లోనే తరలించారు. మీర్‌పేటకు చెందిన ఓ వ్యక్తి, ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని గుండెను నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చాలని వైద్యులు నిర్ణయించారు.
Samayam Telugu Ambulance


ఈ మేరకు రెండు కుటుంబాల సభ్యులను గుండె మార్పిడికి ఒప్పించారు. దీనికోసం క్షణాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను సికింద్రాబాద్ నుంచి నాంపల్లికి చేరవేయడానికి పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో కొద్దిసేపు ఇతర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, చర్యలు తీసుకున్నారు.

ఉదయం 10.30 గంటల ప్రాంతంలో యశోద ఆసుపత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్యుల బృందం గుండెను తీసుకెళ్లి, నాంపల్లి కేర్ ఆసుపత్రిలో అవసరం ఉన్న వ్యక్తికి అమర్చారు. కుటుంబ సభ్యుడు మరణించి పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ, అతడి గుండెను ఇచ్చినందుకు, గ్రీన్ కారిడర్ ఏర్పాటు చేసిన పోలీసులకు, ఆసుపత్రి సిబ్బంది జీవితాంతం రుణపడి ఉంటామని గుండె దానం పొందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.