యాప్నగరం

మా అన్నను చంపిన వాళ్లని వదలను.. హెచ్చరించిన హేమంత్ తమ్ముడు

Chandanagar: రెండ్రోజుల ముందు కూడా తమ వ్యాపారం గురించి సూచనలు పంచుకున్నట్లు సుమంత్ వివరించారు. శుక్రవారం తనకు వీడియో కాల్ చేసి అన్నయ్య మృతదేహాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 26 Sep 2020, 3:14 pm
తన అన్నయ్య హేమంత్‌ను దారుణంగా హత్య చేయడంపై తమ్ముడు సుమంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా ఘటనకు రెండు రోజుల ముందు కూడా హేమంత్ తనకు ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగత విషయాలే కాకుండా ఇద్దరం అప్పుడప్పుడూ తమ బిజినెస్ వ్యవహాలు కూడా చర్చించుకుంటూ ఉంటామని తెలిపారు. రెండ్రోజుల ముందు కూడా తమ వ్యాపారం గురించి సూచనలు పంచుకున్నట్లు వివరించారు. శుక్రవారం తన తల్లిదండ్రులు తనకు వీడియో కాల్ చేసి అన్నయ్య మృతదేహాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu అవంతికను ఓదార్చుతున్న సుమంత్
hemanth brother sumanth


తన అన్న హేమంత్‌ను చంపిన వారిని ఎవరినీ వదలబోనని హెచ్చరించారు. అంతకుముందు ఆయన్ను దారుణంగా అవమానించారని అన్నారు. రోడ్లపై చెప్పుతో కొట్టుకుంటూ తీసుకెళ్లారని నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను తన ఫ్యామిలీని జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సుమంత్ గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.