యాప్నగరం

‘అయోధ్య’ను టచ్ చేస్తే.. 40 వేల ఆలయాలు.. లా బోర్డుకు రాజా సింగ్ వార్నింగ్

అయోధ్య తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు.

Samayam Telugu 17 Nov 2019, 11:15 pm
అయోధ్య తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముస్లిం లా బోర్డు నిర్ణయంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. మొఘలుల పాలన కాలంలో 40 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని ఆరోపించారు. హిందువులు వాటన్నింటిని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తారన్నారు. ముస్లిం లా బోర్డు సభ్యులు అవినీతిపరులని ఆయన ఆరోపించారు. ఇందులో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ద్రోహి కూడా ఉన్నారన్నారు.
Samayam Telugu raja singh1


ముస్లింలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని.. రాజా సింగ్ పిలుపునిచ్చారు. అయోధ్య సమస్య 500-600 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. సుప్రీం గొప్ప తీర్పునిచ్చిందన్న ఆయన.. హిందువులు, ముస్లింలు సంతోషంగా ఉన్నారన్నారు.

భారత ముస్లింలు ఒక వైపు ఉంటే.. ముస్లిం లా బోర్డు మరోవైు ఉందని ఆరోపించారు. ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలకాలని ఆయన బోర్డును కోరారు.

‘‘చరిత్రేంటో మీకు తెలుసు.. తైమూర్, మహ్మద్ గజినీ, టిప్పు సుల్తాన్, బాబర్, అల్లావుద్దీన్ చిస్తీ, అహ్మద్ షా, ఔరంగజేబ్ లాంటి పాలకులు ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారు’’ అని ముస్లిం లా బోర్డును ఉద్దేశించి రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.