యాప్నగరం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వచ్చే 5 రోజులు ఇలా..

Weather Updates: కేంద్ర వాతావరణ విభాగం వాతావరణ సమాచారం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. చిటికెలో సమగ్ర వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.

Samayam Telugu 28 Jul 2020, 2:44 pm
దట్టమైన మేఘాలు తెలుగు రాష్ట్రాల పరిధిలో వ్యాపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు గుర్తించారు. దీనికితోడు పవనంలోనూ కదలికలు చురుగ్గా ఉండడంతో మంగళవారం నుంచి రాబోయే 5 రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
weather report


ప్రస్తుతం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు రెండు రోజుల పాటు వీస్తాయని అధికారులు తేల్చారు. దీంతో సముద్రం కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు, కేంద్ర వాతావరణ విభాగం వాతావరణ సమాచారం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. చిటికెలో సమగ్ర వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఆవిష్కరించారు. ‘మౌసమ్’ పేరుతో విడుదలైన ఈ మొబైల్ అప్లికేషన్ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘మౌసమ్’ యాప్‌ను ఇక్రిసాట్, ఐఐటీఎం, పుణె, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సంయుక్తంగా రూపొందించి అభివృద్ధి చేశాయి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, ఆర్ధ్రత, గాలి వేగం వంటి సమగ్ర సమాచారాన్ని ఈ యాప్ అందించనుంది. స్థానిక వాతావరణం వివరాలతో పాటు విపత్తుల సమయంలో ప్రత్యేక హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీచేస్తుంది. రాబోయే వారం రోజుల వాతావరణ పరిస్థితులను తెలియజేస్తుంది. ప్రమాద హెచ్చరికలకు సంబంధించి భిన్న రంగుల్లో(ఎరుపు, పసుపు, నారింజ) కోడ్‌ను రూపొందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.