యాప్నగరం

Telangana Covid : తెలంగాణలో మరో కరోనా కొత్త వేరియెంట్ కేసు.. దేశంలోనే తొలిసారి నమోదు

Covid Ba.5 Variant: కరోనా కొత్త వేరియెంట్ బీఏ5 కేసు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నమోదైంది. నాలుగు రోజుల కిందే బీఏ4 కేసు రికార్డు కాగా.. ఈ రెండు వేరియెంట్ కేసులు దేశంలో తొలిసారి మన దగ్గర నమోదు కావడం గమనార్హం.

Authored byRaj Kumar | Samayam Telugu 24 May 2022, 10:15 am
తెలంగాణలో కరోనా కొత్త వేరియెంట్ బీఏ5 కేసు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నమోదైంది. నాలుగు రోజుల కిందే బీఏ4 కేసు నమోదుకాగా.. ఈ రెండు వేరియెంట్ కేసులు దేశంలో తొలిసారి మన దగ్గర రికార్డయ్యాయి. న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న ఓ సీనియర్ సిటిజన్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 12న ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చింది.
Samayam Telugu covid test


ఈక్రమంలోనే వైద్య శాఖ ర్యాండమ్‌గా కొన్ని నమూనాలను జన్యు విశ్లేషణలకు గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌కు పంపింది. అందులో వృద్ధుడి శాంపిల్‌ కూడా ఉంది. జన్యు ఫలితాల్లో బీఏ5 వేరియెంట్‌ ఉన్నట్లు తేలింది. దీనిపై ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు స్పందించారు. ఆయనకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇద్దరు కాంటాక్టులను గుర్తించామని వెల్లడించారు. వారిని సైతం ఐసొలేట్‌ చేశామని.. నమూనాలను ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం పంపామన్నారు. ఫలితాల కోసం చూస్తున్నామన్నారు. తెలంగాణలో కరోనా నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం లేదని డాక్టర్‌ గడల వెల్లడించారు.

CM KCR : హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. అర్ధాంతరంగా ముగిసిన దేశవ్యాప్త పర్యటన.. కారణమదేనా?
ఇటు నాలుగు రోజుల కింద కరోనా బీఏ4 వేరియంట్‌ కూడా దేశంలో తొలిసారిగా మన దగ్గరే నమోదైంది. దీనిపై కూడా డీఈ శ్రీనివాసరావు మాట్లాడారు. బీఏ4, బీఏ5 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్స్‌ అని వెల్లడించారు. కాబట్టి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండదన్నారుు. అయితే, వ్యాపించే లక్షణం ఈ వేరియెంట్‌లో ఉంటుదన్నారు. అందుకే కొన్ని దేశాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.