యాప్నగరం

ఎలా ఉన్నారని ఈటలను పలకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రాజన్న !

Etela Rajender: బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ ఆవరణలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మేల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే జననార్ధన్ రెడ్డి ఎలా ఉన్నారని ఈటలను అడగ్గా.. అందుకు ఆయన తనదైన రీతిలో బదిలిచ్చారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 7 Feb 2023, 10:07 am

ప్రధానాంశాలు:

  • అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ
  • ఎలా ఉన్నారని ఈటలను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి
  • తనదైన రీతిలో బదులిచ్చిన రాజన్న
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Etela Rajender
ఈటల రాజేందర్
Telangana Assembly: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానకి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సోమవారం (ఫిబ్రవరి 6న) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మెుత్తం 2,90,396 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం అంనంతరం.. శాసనసభతో పాటు మండలిని స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా బుధవారాని ( ఫిబ్రవరి 8)కి వాయిదా వేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో సోమవారం అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పలకరించారు.

దీంతో "మాతో మాట్లాడితే మీ వాళ్లు ( BRS) భయపడరా ? నన్ను పలకిరించే ధైర్యం ఉందా ?" అని ఈటల రాజేందర్ అన్నారు. అందకుు జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ.. "దానికేముందన్నా.. రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధం వేరు" అని బదులిచ్చారు. ఇంతకీ ఎలా ఉన్నారు ? అని ఈటలను కుశలప్రశ్నలు అడిగారు. ఈటల బదులిస్తూ.. "వేడి నూనెలో వేయించి.. ఎలా ఉంది ? అని అడిగినట్లుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉన్న రాజకీయాల్లో విలువలెక్కడున్నాయని అన్నారు.

అంతలో అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. వేర్వేరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కనీసం మర్యదపూర్వకంగా పలకరించుకునే పరిస్థితులు ఇప్పుడు లేకుండా పోయాయన్నారు. తాను దుబ్బాక నియోజవర్గ సమస్యల పరిష్కారం కోసం మంత్రి హరీశ్ రావును కలిస్తే.. రఘనందన్ బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని వాపోయారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.