యాప్నగరం

అలా అయితే మేం జాతీయ పార్టీ పెడతాం.. కేటీఆర్, పీయుశ్ గోయల్ మధ్య సరదా చర్చ

Bio Asia Summit 2020: కేవలం హైదరాబాద్, తెలంగాణను మాత్రమే ప్రమోట్ చేయడం కాదు.. దేశాన్ని కూడా మార్కెటింగ్ చేయాలని కోరారు. దీనిపై సరదాగా స్పందించిన మంత్రి కేటీఆర్.. అలా చేయాల్సి వస్తే తాము జాతీయ పార్టీ పెట్టాల్సి వస్తుందని సమాధానమిచ్చారు.

Samayam Telugu 19 Feb 2020, 10:39 am
హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏసియా సదస్సు 2020లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, మంత్రి కేటీఆర్ మధ్య నడిచిన చర్చ తమాషాగా ఉంది. వేదికపై అందరు ప్రముఖులు కూర్చొని ఉండగా ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu ktr piyush goyal.


పీయుష్ గోయల్ మాట్లాడుతూ.. కేవలం హైదరాబాద్, తెలంగాణను మాత్రమే ప్రమోట్ చేయడం కాదు.. దేశాన్ని కూడా మార్కెటింగ్ చేయాలని కోరారు. దీనిపై సరదాగా స్పందించిన మంత్రి కేటీఆర్.. అలా చేయాల్సి వస్తే తాము జాతీయ పార్టీ పెట్టాల్సి వస్తుందని సమాధానమిచ్చారు. ఇందుకు కేంద్ర మంత్రి తెలివిగా స్పందించారు. మీరు జాతీయ పార్టీతో ముందుకు రావచ్చు కానీ, ప్రస్తుతం దేశంలో అత్యధిక బలం తమకే ఉందని చెప్పారు.

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బయో ఏసియా సదస్సు సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బుధవారంతో సదస్సు ముగియనుంది. జీవ శాస్త్రం, ఔషధ, వైద్య చికిత్సలోని విధానాలు, ఆవిష్కరణలు, పరిశోధనలు, వంటి అంశాలపై చర్చా గోష్ఠులు, సమావేశాలు ఈ సదస్సులో జరుగుతున్నాయి.

Also Read: రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన.. కంటతడి పెట్టిస్తున్న వీడియోundefined
మరోవైపు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలమవుతోందని ఎండగడుతోంది. మంగళవారం చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తలసాని చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Must Read: శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన.. సభలో తలసానికి రైల్వే మంత్రి గట్టి కౌంటర్


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.