యాప్నగరం

రూ.500 దినసరి కూలీకి రూ.కోటి పన్ను కట్టాలని నోటీసులు

IT Department: హైదరాబాద్‌కు చెందిన బావ్ సాహెబ్ అహీర్ బతుకుదెరువు కోసం కొనాళ్ల క్రితం ముంబయికి వెళ్లాడు. అక్కడ రోజువారీ కూలీ పనులకు వెళ్తూ పొట్ట పోషించుకుంటున్నాడు. బంధువు ఇంట్లోనే ఉంటూ రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నాడు.

Samayam Telugu 16 Jan 2020, 5:38 pm
రెక్కాడితేనేగానీ పొట్ట నిండని పరిస్థితిలో ఉన్న ఓ కూలీకి రూ.కోటి పన్ను కట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఐటీశాఖ నుంచి అతనికి రూ.కోటి కట్టాలని ఇటీవలే నోటీసు వచ్చింది. దీంతో అతను ఆశ్చర్యపోయాడు. ముందుసారి నోటీసు వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. పొరపాటున వచ్చిందేమో అనుకొని, కొద్ది రోజుల తర్వాత ఆ విషయమే మరచిపోయాడు. మళ్లీ నోటీసు రావడంతో కంగారు పడిపోయి, పోలీసులను ఆశ్రయించాడు.
Samayam Telugu income tax


Also Read: ఆ మున్సిపాలిటీలో మాత్రం కచ్చితంగా గులాబి జెండా ఎగరాలి.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌కు చెందిన బావ్ సాహెబ్ అహీర్ బతుకుదెరువు కోసం కొనాళ్ల క్రితం ముంబయికి వెళ్లాడు. అక్కడ రోజువారీ కూలీ పనులకు వెళ్తూ పొట్ట పోషించుకుంటున్నాడు. బంధువు ఇంట్లోనే ఉంటూ రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నాడు. ఈ స్థితిలో ఉన్న అహీర్‌కు ఓ రోజు ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది. ఆదాయపు పన్ను కింద రూ. 1.05 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. కొన్నాళ్ళకు ఆ విషయం మరచిపోయాడు.

Also Read: వీడియో: రెండెకరాల్లో భారీ కారు.. సిరిసిల్లలో కేటీఆర్ కోసం..

కొద్ది రోజులు గడిచాక, అదే నోటీసు మళ్లీ రావడంతో భయపడిపోయిన అహీర్.. పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఈ నోటీసులు ఎందుకు వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పెద్ద నోట్ల రద్దు సమయంలో అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేశారని తెలిసింది. దానికి పాన్ నెంబరు జత చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పన్ను కట్టాలని నోటీసులు పంపినట్లు వెల్లడైంది. అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారుల వద్ద ఆధారాలున్నాయి. అయితే, అసలు తనకు బ్యాంకు ఖాతానే లేదని అహీర్ వాదిస్తుండడం గమనార్హం.

Also Read: వీడియో: మంత్రి మల్లారెడ్డి రహస్య ఫోన్ సంభాషణ, గుట్టంతా బట్టబయలు!
Also Read: CM KCR మేనల్లుడినని వ్యక్తి హల్‌చల్.. పోలీసులకు చుక్కలు, వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.