యాప్నగరం

సిద్దిపేటకు హరీశ్ రావు గుడ్‌న్యూస్.. భారీ ప్రాజెక్టు ప్రకటన

Siddipet: సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతానికి కేసీఆర్ నగర్‌గా బుధవారం నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Samayam Telugu 9 Dec 2020, 9:40 pm
సిద్దిపేటలో ఓ ముఖ్యమైన ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. నగరంలో 3 ఎకరాల్లో రూ.45 కోట్లతో ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతానికి కేసీఆర్ నగర్‌గా బుధవారం నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని అన్నారు. అనంతరం సిద్దిపేటలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
Samayam Telugu హరీశ్ రావు
Harish Rao


సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో రైతు వేదిక, సకల సౌకర్యాలతో ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కా భవనం, 1000 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు నక్లెస్ రోడ్డు ప్రారంభం, సీసీ రోడ్డు, పోలీసు ఔట్ పోస్ట్, పిల్లల కోసం పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫంక్షన్ హాల్ అన్ని హుంగులతో కూడిన గృహాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

మొదటి విడతగా 1341, రెండో విడతగా 1000 ఇళ్లు, పేద ప్రజలు ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం, 160 కోట్లతో రింగ్ రోడ్డు, రింగ్ రోడ్డుకు కేసీఆర్ మార్గ్‌గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.