యాప్నగరం

Ghmc Elections: పోలింగ్ ‌బూతులో టేబుళ్లను కాలితో తన్నిన సీఐ

పోలింగ్ బూతులో టేబుళ్లను కాళ్లతో తన్ని జగద్గిరి గుట్ట సీఐ వీరంగం సృష్టించారు. దీంతో ఆయన తీరుపై స్థానికులతో పాటు బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Samayam Telugu 1 Dec 2020, 4:00 pm
హైదరాబాద్‌లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు పలుచోట్ల గొడవలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. కూకట్ పల్లి 121 డివిజన్ దీనబంధు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూతు నెంబర్ 48 వద్ద జగద్గిరి గుట్ట సిఐ వీరంగం సృష్టించారు. బూటు కాళ్లతో పోలింగ్ బూతు టేబుళ్లను సీఐ తన్నారు.అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలను బూతు పదజాలంతో దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూకట్‌పల్లి దీనబంధు కాలనీలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అసభ్య పదాలతో తిట్టడమే కాకుండా సీఐ అడిగిన వారిపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తల ఆరోపిస్తున్నారు.
Samayam Telugu టేబుళ్లను తన్నిన సీఐ


Read More: రెయిన్ బజార్‌లో రిగ్గింగ్ కలకలం... బీజేపీ, ఎంఐఎం తోపులాట

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే సాగుతోంది. ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ 26లో పోలింగ్‌ రద్దు అయింది. ఆ ఎన్నికను ఎల్లండి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే ఓటర్లు ఎవరూ సరిగా ఓటింగ్ కోసం రాలేదు. సరిగా పోలింగ్ జగరలేదు. ఇంకా ఓటింగ్‌కు నాలుగున్నర గంటల సమయం మాత్రమే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.