యాప్నగరం

షాకింగ్.. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Janagam MLA: తెలంగాణలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం. ఆయన కరోనా లక్షణాలతో ఉండగా.. వైరస్ అనుమానంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు ప్రకటించారు.

Samayam Telugu 7 Dec 2022, 2:48 pm
కరోనా వైరస్ మహమ్మారి సామాన్య ప్రజలను, ప్రభుత్వ అధికారులనే కాక ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో ఓ ప్రజా ప్రతినిధికి కరోనా పాజిటివ్‌గా తేలిన తొలి కేసు నమోదైంది. టీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని వైద్యులు గుర్తించారు. ఆయన కరోనా లక్షణాలతో ఉండగా.. వైరస్ అనుమానంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు ప్రకటించారు.
Samayam Telugu mlas
ఎమ్మెల్యే


తెలంగాణలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, జాతీయ స్థాయి నాయకులు సైతం ఇప్పటికే కరోనా బారిన పడినప్పటికీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ అలాంటి ఘటనలు నమోదు కాలేదు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాత్రం కరోనా బారిన పడి విజయవంతంగా కోలుకున్నారు.

Must Read: హైదరాబాద్‌లో జుంబా డాన్స్ మోసం.. ఆంటీలు టార్గెట్‌గా హైటెక్ దందా

మరోవైపు, తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజులోనే అత్యంత భారీ సంఖ్యలో కరోనా కేసులను గుర్తించారు. మొత్తం 164 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4484కు చేరుకుంది. వీటిలో, మొత్తం లోకల్ కేసులు మాత్రం 4,035 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అయితే, శుక్రవారం మరో 9 మంది కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 174కి చేరుకుంది. ఇక రాష్ట్రంలో 2,032 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.