యాప్నగరం

బండి సంజయ్ అరస్ట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్

సిద్ధిపేటలో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనపై జనసేనాని స్పందించారు. బీజేపీ శ్రేణుల్ని పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

Samayam Telugu 26 Oct 2020, 10:17 pm
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు వెళ్తుండగా ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో బండి సంజయ్ అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. సంజయ్‌ను అరెస్ట్ చేయడం పోలీసుల దుందుకుడు చర్య అన్నారు. పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోందని చెప్పారు. ఉద్రిక్తతలకు తావిచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల నిబంధనలు అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలని సూచించారు. బీజేపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయడం గర్హనీయమన్నారు పవన్ కళ్యాణ్.
Samayam Telugu పవన్ కళ్యాణ్
pawan kalyan


సిద్దిపేటలో రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేటలో సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని సిద్దిపేట నుంచి కరీంనగర్‌కి తీసుకెళ్తున్నారు. సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.

Read More: సిద్ధిపేటలో దొరికిన డబ్బులో.. రూ.5.87 లక్షలు లాక్కెళ్లారు: సీపీ

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లక్షల రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ విషయం తెలియడంతో ఆయన హుటాహుటిన సిద్దిపేటకు బీజేపీ సీనియర్లంతా చేరుకున్నారు. తనిఖీల్లో భాగంగా బీజేపీ నేత రఘునందన్ మామ ఇంట్లో ఉన్న రూ.18.67 లక్షలను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలోనే బీజేపీ నేత బంధువుల ఇళ్లలో డబ్బులు దొరకడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.