యాప్నగరం

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల

Telangana Olympic Association: జయేష్ రంజన్ ప్యానల్‌కు చెందిన, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన జగన్మోహన్ రావు.. రంగారావు ప్యానల్‌కు చెందిన జగదీశ్వర్ యాదవ్‌పై రెండు ఓట్ల తేడాతో ఓడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ నైతిక విజయం తనదేనని అన్నారు.

Samayam Telugu 9 Feb 2020, 10:46 pm
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయేశ్ రంజన్ విజయం సాధించారు. ఈ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో జయేష్ రంజన్-రంగారావు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. జయేశ్ రంజన్‌కు 46 ఓట్లు పోలవ్వగా.. రంగారావుకు 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. 13 ఓట్ల తేడాతో జయేష్ రంజన్ గెలిచారు. దీంతో జయేష్ రంజన్ ప్యానెల్ సభ్యులు స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.
Samayam Telugu Jayesh-Ranjan-526x400


అయితే, వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థులు మహ్మద్ అలీ, ప్రేమ్‌రాజ్, సరల్ తల్వార్, వేణుగోపాలచారి గెలుపొందారు. మరోవైపు, రంజన్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఓడిపోయారు. వారిలో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అభ్యర్థి పవన్‌కుమార్, ట్రెజరర్‌ అభ్యర్థి ఫణిరావు, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన జగన్మోహన్ రావు, ట్రాయత్లాన్‌ అభ్యర్థి శ్రీశైలం ఓడిపోయారు.

కోర్టుకు వెళ్తా : జగన్మోహన్ రావు
జయేష్ రంజన్ ప్యానల్‌కు చెందిన, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన జగన్మోహన్ రావు.. రంగారావు ప్యానల్‌కు చెందిన జగదీశ్వర్ యాదవ్‌పై రెండు ఓట్ల తేడాతో ఓడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ నైతిక విజయం తనదేనని అన్నారు. ఐఓఏ ముందు 30 సంఘాలకు ఓటు హక్కు ఇచ్చారని.. ఆ తర్వాత 42కు పెంచారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రిటర్నింగ్ ఆఫీసర్‌‌కు వ్యతిరేకంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఒకరికి బదులు మరొకరు ఓటు వేశారని మండిపడ్డారు. అక్రమాలపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. నెల రోజుల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయని.. గెలిచి చూపిస్తానని జగన్మోహనరావు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.