యాప్నగరం

బావి నుంచి జీపు వెలికితీత.. ఇంకా చిక్కని మరో 3 మృత దేహాలు

Sangem: వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా జీపుతో సహా 15 మంది బావిలో పడగా వారిలో 11 మంది స్వల్పగాయాలతో బయటపడిన విషయం తెలిసిందే.

Samayam Telugu 27 Oct 2020, 10:26 pm
వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో జరిగిన జీపు ప్రమాదంలో ఎట్టకేలకు బావి నుంచి వాహనాన్ని వెలికితీశారు. గవిచర్ల వద్ద జీపు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. నీటిలో పడిన జీపును క్రేన్‌ సాయంతో పోలీసులు వెలికితీశారు. జీపుతో పాటు డ్రైవర్‌ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. మృతుడు ఏనుగల్లుకు చెందిన డ్రైవర్‌ సతీశ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బావిలో మరో ముగ్గురు ప్రయాణికులు కూడా ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Samayam Telugu బావిలో నుంచి జీపును తీస్తున్న జేసీబీ
warangal accident


ఘటనాస్థలిలో అగ్ని మాపక, రెవెన్యూ, ఎక్సైజ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మామునూరు ఏసీపీ శ్యాం సుందర్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా జీపుతో సహా 15 మంది బావిలో పడగా వారిలో 11 మంది స్వల్పగాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం.. జీపు డ్రైవర్‌కు ఫిట్స్ రావడం వల్ల అదుపు తప్పి వాహనం బావిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు జీపులోని పన్నెండు మంది ప్రయాణికులను క్షేమంగా బయటికి తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.