యాప్నగరం

గద్వాలలో కరోనా కలకలం.. ఐసోలేషన్‌లోకి జర్నలిస్టులు

మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో కరోనా కలకలం కారణంగా మీడియా ప్రతినిధులను ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కూడా హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 21 Apr 2020, 11:39 pm
మహబూబ్‌నగర్‌లో కొందరు మీడియా ప్రతినిధులను ఐసోలేషన్ కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు స్టాఫ్ రిపోర్టర్లతోపాటు ఓ కెమెరామెన్ ఉన్నారు. మహబూబ్ నగర్‌లో ఓ న్యూస్ ఛానెల్‌‌కు చెందిన స్టాఫ్ రిప్టోరర్‌‌తోపాటు కెమెరా మ్యాన్, మరో న్యూస్ ఛానెల్ స్టాఫ్ రిపోర్టర్ ఐసోలేషన్‌కు వెళ్లగా.. గద్వాలకు చెందిన మరో స్టాఫర్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు.
Samayam Telugu reporter


గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరుడు ఒకరు ఇటీవల చనిపోగా.. ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా మరణించిన వ్యక్తి కుటుంబ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే గత శనివారం నుంచి హోం క్వాంరటైన్లోకి వెళ్లిపోయారు. ఐదు రోజుల క్రితం జర్నలిస్టులు ఎమ్మెల్యేను కాంటాక్ట్ అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎమ్మెల్యే‌ నివాసానికి వెళ్లిన వీరు.. ఆయనతో చాలాసేపు గడపటంతోపాటు ఆయనతో కలిసి భోజనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

గద్వాలలో పని చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ తమ్ముడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. వాళ్ల ఇంటికి సదరు ఛానల్ సిబ్బంది వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా జర్నలిస్టులను ఐసోలేషన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.