యాప్నగరం

కాచిగూడ రైలు ప్రమాదం: ఇంజన్ల మధ్య ఇరుక్కుపోయి డ్రైవర్ ఆర్తనాదాలు

రైలు ప్రమాదంలో రెండు ఇంజన్ల మధ్య ఇరుక్కుపోయిన లోకో పైలట్.. కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే అధికారులు. డ్రైవర్‌కు ఆక్సిజన్ అందిస్తున్న డాక్టర్లు.. బయటకు తీసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం.

Samayam Telugu 11 Nov 2019, 3:27 pm
హైదరాబాద్ కాచిగూడ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నయి. ఈ ప్రమాదంలో 30మందికిపైగా ప్రయాణికులు గాయపడగా.. ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ రెండు రైలు ఇంజన్ల మధ్య ఇరుక్కుపోయాడు.. కాపాడాలంటూ పెద్దగా ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. అతడ్ని బయటకు తీసే ప్రయత్నించారు. రెండు రైలు ఇంజన్లు బలంగా ఢీకొట్టడంతో.. అతడ్ని బయటకు తీయడం కష్టంగా మారింది.
Samayam Telugu rail.


లోక పైలట్‌కు తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగానే.. అతడు నీరసించకుండా అక్కడే ఆక్సిజన్ అందిస్తూ.. సెలైన్ కూడా అక్కడే పెట్టారు. డాక్టర్లు అక్కడికి చేరుకొని.. లోకో పైలట్ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. లోకో పైలట్‌ను బయటకు తీయడానికి దాదాపు రెండు, మూడు గంటలకుపైగా సమయం పట్టింది. వెంటనే అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.. అతడి పరిస్థితి కాస్త విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

సాంకేతిక లోపంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచి ఉన్న ట్రాక్‌లోకి ఎంఎంటీస్ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్స్ గమనించకుండా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్.. నాలుగో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న ఇంటర్‌సిటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌కు చెందిన మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. ట్రెయిన్ ఆగి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఊహించని ఈ ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.