యాప్నగరం

ఎంపీ బండి సంజయ్‌కు డబుల్ ధమాకా.. కేంద్రం మరో తీపి కబురు

Telangana BJP Chief బండి సంజయ్‌ను మరో పదవి వరించింది. దీంతో తెలంగాణ బీజేపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద చాలా ఏర్పాట్లు చేశాయి.

Samayam Telugu 15 Mar 2020, 7:44 pm
కొద్ది రోజులుగా తెలంగాణలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు బాగా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణకు వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద చాలా ఏర్పాట్లు చేశాయి.
Samayam Telugu Bandi Sanjay


అయితే, బండి సంజయ్‌కు కేంద్రం మరో పదవిని కట్టబెట్టింది. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఒకటిగా ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు దేశవ్యాప్తంగా ఉన్న 8 కళాశాలలకు కేంద్రం బోర్డు మెంబర్లను నియమించింది. ఇందులో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌కు బోర్డు మెంబర్‌గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సరిగ్గా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ఆయనకు ఈ పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు, ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Must Read: ‘ఖబడ్దార్ కేసీఆర్.. ఇక నీకు కౌంట్‌డౌన్ మొదలైంది’ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు

బండి సంజయ్ దిల్లీ నుంచి ఆదివారం నగరానికి రానున్నారు. ఎయిర్‌ పోర్టు నుంచీ నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పార్టీ సీనియర్లు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహనరావు, సోయం బాపూరావు, ఎన్.రామచందర్‌రావు, రాజాసింగ్ తదితరులు పాల్గొననున్నారు.

Also Read: ఉమ్మడి ఏపీనే బాగుండేది.. అనవసరంగా విడిపోయాం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.