యాప్నగరం

అక్బరుద్దీన్‌ ఓవైసీకి పోలీసుల షాక్!

Akbaruddin Owaisi | అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఐఎం పార్టీ సమావేశంలో విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. క్లీన్‌చిట్ ఇచ్చిన పోలీసులే తాజాగా కేసు నమోదు చేయడం గమనార్హం.

Samayam Telugu 2 Aug 2019, 8:00 pm
ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి కరీంనగర్ పోలీసులు షాక్ ఇచ్చారు. గతంలో క్లీన్‌చిన్ ఇచ్చిన పోలీసులే కోర్టు ఆదేశాలతో శుక్రవారం (ఆగస్టు 2) కేసు నమోదు చేశారు. జులై 23న కరీంనగర్‌లో నిర్వహించిన ఎంఐఎం పార్టీ సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. ఒక వర్గాన్ని ఉద్ధేశించి విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత బాస సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu akbar


Read also:
అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయలేం: కరీంనగర్ పోలీసులు

అప్పట్లో సోషల్ మీడియాలో కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి న్యాయనిపుణుల సలహాతో అక్బరుద్దీన్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, ఆయనపై కేసు నమోదు చేయలేమంటూ క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో బీజేపీ కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి వీడియో సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించారు.

Read also: అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయండి.. కరీంనగర్ కోర్టు ఆదేశం..

విచారణ చేపట్టిన కోర్టు అక్బరుద్దీన్‌ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153 ఏ, 153 బి, 506, సీఆర్పీసీ 156(3) కింద కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.