యాప్నగరం

డ్రైవర్‌కు గుండెపోటు.. ఆర్టీసీ సమరభేరిలో విషాదం

Saroornagar: ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సకల జనుల సమరభేరిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు.

Samayam Telugu 30 Oct 2019, 7:54 pm
ర్టీసీ కార్మికులు తమ సమ్మెలో భాగంగా నిర్వహిస్తున్న సకల జనుల సమరభేరిలో విషాదం చోటు చేసుకుంది. బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన ఓ డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ 2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ బుధవారం (అక్టోబర్ 30) మధ్యాహ్నం సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనుల సమరభేరికి హాజరయ్యాడు. ఆర్టీసి సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటున్న బాబు గుండెపోటుతో కుప్పకూలాడు.
Samayam Telugu babu


తోటి కార్మికులు బాబును వెంటనే సమీపంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలు ఆందోళన కలిగిస్తుండగా.. మరో కార్మికుడు గుండెపోటుతో కన్నుమూయడం విషాదంగా మారింది. సమ్మె చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 15 మంది మరణించారని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. వీరిలో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు.

Must Read: ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది మూడో ఘటన, క్యాంపస్‌లో కలకలం

ఆర్టీసీ జేఏసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకల జనుల సమరభేరిలో పాల్గొనడానికి వచ్చిన డ్రైవర్ గుండెపోటులో మృతి చెందడం కార్మికుల్లో విషాదాన్ని నింపింది. సమ్మె పట్ల కలత చెందిన బాబు గుండెపోటుకు గురై మృతి చెందాడని కార్మికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మేం ఉడత లాంటి వాళ్లం.. కేసీఆర్ భయపెట్టారు: అశ్వత్థామ రెడ్డి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.