యాప్నగరం

సీఎం-రామలింగారెడ్డి అనుబంధం.. కేసీఆర్ చిరునవ్వులు, అలనాటి ఫోటో వైరల్

Dubbaka MLA: ఆ ఫోటోలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతులు దండలు మార్చుకుంటున్నారు. కేసీఆర్ ఎదురుగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ వెనకే ఓ బ్యానర్ సైతం కట్టి ఉంది.

Samayam Telugu 6 Aug 2020, 11:38 pm
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించే సమయంలో ఆయన కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా ఎంతటి సన్నిహిత సంబంధం ఉందో ఈ పరిణామాన్ని బట్టి అర్థం అవుతోంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే ఓ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పెళ్లి నాటి చిత్రం. ఆ పెళ్లి ఓ వేదికపై జరగడం విశేషం.
Samayam Telugu వైరల్ అవుతున్న పాత చిత్రం
KCR and dubbaka mla ramalinga reddy old photo


Also Read: undefined

ఆ ఫోటోలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతులు దండలు మార్చుకుంటున్నారు. కేసీఆర్ ఎదురుగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ వెనకే ఓ బ్యానర్ సైతం కట్టి ఉంది. దానిపై యస్.రామలింగారెడ్డి-సుజాతల సభావివాహానికి సుస్వాగతం అని రాసి ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కవి కాళోజీ నిర్వహించారు. ఈ విషయం కూడా అదే బ్యానర్‌పై ఉంది. అతిథులుగా విజయరామారావు, కేసీఆర్ హాజరయ్యారు.

కాగా.. తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి నాళ్ల నుంచి ఇప్పటి వరకూ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కేసీఆర్ వెంటే నడిచారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా రామలింగారెడ్డితో కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.