యాప్నగరం

హైదరాబాద్ అపార్ట్‌మెంట్ వాసులకు సీఎం గుడ్‌న్యూస్, నా కల ఇదే: కేసీఆర్

LB Stadium: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలు ఓటేసే ముందు సంబంధిత నాయకుడి గురించి ఎవరికి వారు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

Samayam Telugu 28 Nov 2020, 6:28 pm
ప్రజలు ఓటేసే ముందు సంబంధిత నాయకుడి గురించి ఎవరికి వారు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. తద్వారా ప్రజలకు సేవ చేసే మంచి నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
Samayam Telugu సభలో మాట్లాడుతున్న కేసీఆర్
kcr


‘‘హైదరాబాద్ నగరం ఎంతో విశేషమైన చైతన్యవంతమైన నగరం. గతంలో మనం ఎన్నో మాటలు పడ్డాం. 2001లో నేను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపట్టినప్పుడు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. ఎన్నో అపోహల మధ్య తెలంగాణ వచ్చింది. ఎంతో మంది నమ్మకంతో ప్రజలు తొలి నుంచి టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. రాష్ట్రాన్ని నడపలేరని ప్రముఖ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయని ఆయనే నాతో అన్నారు. ఈ ఆరేళ్లు తెలంగాణలో ఎలాంటి మార్పులు జరిగాయో మీకందరికీ తెలుసు’’

‘‘గతంలో ఏ ఇంటికెళ్లినా, ఏ షాపుకెళ్లినా పెట్రోలు కంపు ఉండేది. కరెంటు కోతల వల్ల అందరూ జనరేటర్లు, ఇన్వర్టర్లు పెట్టుకునేవారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఇదో సంచలన పరిణామం. ఇదంతా ఒట్టిగా రాలే. దీని వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణకే అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే వచ్చింది.’’

‘‘ఇప్పుడు ప్రతి చోటా మంచి నీటి సమస్యను తీర్చేశాం. అద్భుతమైన మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చాం. ఇకపై 24 గంటల మంచినీటి సదుపాయం కల్పించేలా శ్రమిస్తాం. ఇది నా కల. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 24 గంటల మంచి నీటి సరఫరా ఇచ్చేలా పని చేస్తాం. దేశ విదేశాల్లో తిరిగి, కమిటీ వేసి ఈ నిర్ణయానికొచ్చాం. ఇప్పటికే నగరంలో 20 వేల లీటర్ల వరకూ ఫ్రీగా ఉచిత మంచినీటి సరఫరా హామీ ప్రకటించాం. శాశ్వతంగా ఇది అమలులో ఉంటుంది. పేదలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అపార్టుమెంట్ల విషయంలో కూడా 20 వేల లీటర్ల పథకం వర్తిస్తుంది.’’ అని కేసీఆర్ అన్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.