యాప్నగరం

పేదలకు కిషన్ రెడ్డి నుంచి స్పెషల్ కిట్లు.. మోదీ పేరుతో 9 రకాలు

Lockdown Hyderabad: కష్టకాలంలో పేదలు పస్తులుండకూడదన్న ఉద్దేశంతో నిత్యావసరాల పంపిణీని చేపట్టామని కావ్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి పండ్ల రసాలు, కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు.

Samayam Telugu 3 May 2020, 3:33 pm
లాక్ డౌన్ వేళ పేదలకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన సతీమణి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీల్లో నివాసం ఉండే 10 వేల పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా కిషన్ రెడ్డి భార్య కావ్య వివరించారు. ఇందుకోసం తొమ్మిది రకాల నిత్యావసరాలతో ‘మోదీ కిట్’ను సిద్ధం చేయించామని ఆమె తెలిపారు.
Samayam Telugu కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి (ఫైల్ ఫోటో)


కష్టకాలంలో పేదలు పస్తులుండకూడదన్న ఉద్దేశంతో నిత్యావసరాల పంపిణీని చేపట్టామని ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి పండ్ల రసాలు, కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు. సోమవారం నుంచి బస్తీల్లోని పేదలకు నిత్యావసరాలను అందిస్తామని ఆమె వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలకు బీజేపీ శ్రేణులు అండగా ఉండాలని కిషన్ రెడ్డి సతీమణి పిలుపునిచ్చారు.

Also Read: undefined

మరోవైపు, అన్ని రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయం మేరకే దేశంలో లాక్ డౌన్‌ను 2 వారాల పాటు పొడిగించామని కిషన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చే సమాచారం ప్రకారమేర జోన్లను ఏర్పాటు చేశామని, రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం సహా.. వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.