యాప్నగరం

పొత్తు లేదు కానీ ఎంఐఎంను అలా గెలిపిస్తారు.. మాజీ ఎంపీ ఇంట్రస్టింగ్ ట్వీట్

గ్రేటర్‌లో ఎంఐఎంతో పొత్తు ఉండదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Nov 2020, 9:04 am
గ్రేటర్ ఎన్నికల వేళ అధికార పార్టీపై ప్రతిపక్షాలన్నీ గురి పెట్టాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చిన విమర్శలతో దాడి చేస్తున్నాయి. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి .. అధికార పార్టీ మరోసారి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈసారి మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. గురువారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పలు అంశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ అధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుందన్నారు.
Samayam Telugu కేసీఆర్, ఎంపీ అసద్
kcr mim alliance


అయితే మేయర్ పదవి ఎంఐఎంకు ఇస్తారని ప్రెస్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదన్నారు. ఈసారి కూడా టీఆర్ఎస్ అన్ని డివిజన్లలో పోటీ చేస్తుందన్నారు. మేయర్ పదవి టీఆర్ఎస్ మహిళకే దక్కుతుందన్నారు. అయితే కేటీఆర్ ఈ చేసిన పొత్తు వ్యాఖ్యలపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎంఐఎంతో పొత్తు లేదు కానీ వారి అభ్యర్థుల్ని గెలిపిస్తారంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు.

Read More: ఫ్రెండ్ ఫోన్ ఎత్తడంలేదని... యువతి ఆత్మహత్యాయత్నం

యువరాజు కేటీఆర్... ముస్లీం ఓటర్లు 70శాతం కన్నా ఎక్కువగా ఉన్న సులేమాన్ నగర్, శాస్త్రీపురం మొదలైన డివిజన్లలో ముస్లీంతేరుల్ని అభ్యర్థులుగా నిలబెడతారన్నారు. పొత్తు ఉండదు కానీ... ఆ విధంగా ఎంఐఎం గెలుపునకు టీఆర్ఎస్ సాయపడుతుందని తాను అనుకుంటున్నాన్నారు. ‘నాకు ఏం తెలియడం లేదా? లేదంటే ఓటరు ప్రజలు వెదవలని కేటీఆర్ భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.’ ఎంఐఎంతో తనకు ఎలాంటి దోస్తీ లేదని, పొత్తు కూడా ఉండదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేశారు. మరి దీనిపై అధికార పార్టీ నేతలు, కేటీఆర్ స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.