యాప్నగరం

TRS ఎమ్మెల్యే సతీమణికి కరోనా.. ఎమ్మెల్యే పీఏ, పనిమనిషికి సైతం..

Coroanvirus in Kothagudem | కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా సతీమణి, పనిమనిషి, పీఏకు కరోనా పాజిటివ్ అని తేలింది. ర్యాపిడ్ టెస్టులో ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

Samayam Telugu 27 Jul 2020, 9:04 am
నెల రోజుల క్రితం వరకు హైదరాబాద్, పరిసర జిల్లాల్లోనే కోవిడ్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కానీ ఆంక్షల సడలింపు తర్వాత హైదరాబాద్ నుంచి రాకపోకలు పెరగడం.. వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరడంతో.. జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఐపీఎస్‌లు కూడా పెద్ద ఎత్తున కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Samayam Telugu Coronavirus
Representative image


తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణికి కూడా కరోనా సోకింది. ఎమ్మెల్యే పీఏ, ఇంట్లో పని మనిషికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆదివారం వైద్యారోగ్య శాఖ అధికారులు యాంటీజెన్ టెస్టులు నిర్వహించగా విషయం తెలిసింది. వనమాతోపాటు ఆయన కుమారుడు రాఘవకు నెగటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. యాంటీజెన్ టెస్టులో నెగటివ్ రావడంతో.. ఎమ్మెల్యే, ఆయన తనయుడికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే అవకాశం ఉంది.

మరోవైపు మణుగూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరేందుకు హైదరాబాద్ వెళ్లిన ఆయన.. కరోనా సోకడంతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగూడెంలోని నేతాజీ మార్కెట్‌కు చెందిన ఓ వ్యక్తి సైతం కరోనా సోకి చనిపోయారు. అంతకు ముందు భద్రాచలం పట్టణంలోనూ ఒకరు కరోనా లక్షణాలతో చనిపోగా.. అనంతరం ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం పట్టణంలో ఇద్దరు, పాల్వంచలో ఇద్దరు, పాత పాల్వంచకు చెందిన మహిళ, సుజాతనగర్‌లో ఒకరు, హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.