యాప్నగరం

నేను నెమ్మదిగానే నడిపా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ డిజైనే కారణం.. హైకోర్టుకు నిందితుడు

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదం కేసులో నిందితుడు కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు.. పోలీసులకు షాకిచ్చారు. కారును తాను తక్కువ వేగంతోనే నడిపానని, ఫ్లైఓవర్ డిజైనే ప్రమాదానికి కారణమని హైకోర్టును ఆశ్రయించాడు. తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఈ ఘటనలో ఓ మహిళ మృతికి, పలువురు గాయపడటానికి కారణమైన కృష్ణమిలన్ రావు.. ప్రమాద సమయంలో తన వాహనం 40-50 kmph వేగంతో ఉందని కోర్టుకు తెలపడం గమనార్హం.

Samayam Telugu 10 Dec 2019, 10:00 pm

Samayam Telugu krishnamilan rao says he wasnt speed blames design in biodiversity flyover accident
నేను నెమ్మదిగానే నడిపా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ డిజైనే కారణం.. హైకోర్టుకు నిందితుడు

అతడిని అరెస్టు చేయొద్దు..

కృష్ణమిలన్ రావు పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అతడిని అరెస్టు చేయొద్దని సోమవారం (డిసెంబర్ 9) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 వరకు అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించవద్దని తెలంగాణ పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాయదుర్గం పోలీసులు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఫ్లైఓవర్‌పై వేగ పరిమితి 40 కిలోమీటర్లే

ఫ్లైఓవర్ ప్రమాదానికి కృష్ణమిలాన్ రావే కారణమని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారు గంటకు 104 కి.మీ. వేగంతో ఉందని కోర్టుకు తెలిపారు. ఫ్లైఓవర్‌పై వేగ పరిమితి 40 kmph మాత్రమేనని వివరించారు. ఓవర్ స్పీడ్‌తో ప్రయాణం చేసి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడని.. ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందారని తెలిపారు. అతడి అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

టెక్నికల్‌ అంశాలతో తిరకాసు పెడుతున్న లాయర్!

కృష్ణమిలన్ రావు లాయర్ ప్రభాకర్ రావు ఈ కేసులో సాంకేతిక అంశాలపై దృష్టి సారించి వాదనలు వినిపిస్తున్నారు. ఫ్లైఓవర్‌పై S-టైప్ వంపు ఈ ప్రమాదానికి కారణమని వాదించారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు.. బెయిల్ పొందడానికి వెసులుబాటు ఉన్న ఐపీసీ 304ఎ సెక్షన్ కింద తన క్లైంట్‌పై కేసు నమోదు చేశారని.. అరెస్టు చేసే ఉద్దేశంతో డిసెంబర్ 3న దాన్ని నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని కోర్టుకు వివరించారు.

అసలేం జరిగింది?

నగరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నవంబర్ 23న ఈ ఘోర దుర్ఘటన జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు వంతెన రెయిలింగ్‌ను తాకి, అమాంతం ఎగిరి కింద పడింది. ఆ సమయంలో రోడ్డుపై నిల్చొని ఉన్న సత్యవేణి అనే మహిళపై ఆ కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కారు నడుపుతున్న కృష్ణమిలన్ రావు సీటు బెల్టు పెట్టుకోవడంతో గాయాలతో బయటపడ్డారు.

Also Read: హైదరాబాద్ మెట్రోలో Zee5 సేవలు.. ఇంటర్నెట్ లేకుండానే సినిమా చూడొచ్చు

Video-హైదరాబాద్ యాక్సిడెంట్ వీడియో: ఫ్లైఓవర్ పైనుంచి గాల్లోకి ఎగిరి జనాలపై పడిన కారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.