యాప్నగరం

కమాన్ ఇండియా... ఆ గీత మనం నేలమట్టం చేద్దాం: కేటీఆర్

దేశ ప్రజలకు కేటీఆర్ పిలుపు. కరోనా వైరస్ పై తాజా ట్వీట్. ఆ గ్రాఫ్ మనం నేలమట్టం చేద్దాం అన్న కేటీఆర్. ప్రపంచ దేశాలకన్నా మనం బాగా చేస్తున్నామన్న మంత్రి.

Samayam Telugu 29 Mar 2020, 2:29 pm
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. వివిధ దేశాల్లో ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. అగ్రారాజ్యంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో జనం మృతి చెందారు. ఇక చైనా, ఇటలీ, స్పెయిన్‌లో మారణహోమమే సృష్టిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం ఇప్పటివరకు కరోనా మరణాలు 26 ఉన్నాయి. అయితే ఈ సంఖ్యను మరింత తగ్గించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత సామాజిక దూరం పాటిస్తే... అంతే త్వరగా ఈ వ్యాధిని మన దేశం నుంచి పారద్రోలవచ్చని ఇప్పటికే రాజకీయ నేతలు, సెలబ్రిటీలు పదే పదే చెబుతున్నారు. తాజాగా కేటీఆర్... ఇదే విషయాన్ని గ్రాఫ్ ఆధారంగా చూపించారు. ట్విట్టర్‌లో మంత్రి ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందన్న విషయాన్ని గ్రాఫ్‌లోని గీతల ద్వారా చూపించారు. ఆ గ్రాఫ్‌లో మన భారత్ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, యూకే, యూస్ అన్నీ మనకంటే ముందుగా ఉన్నాయి.
Samayam Telugu index.


Also Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: మద్యం లేదని ఇంట్లోని కత్తితో గొంతు కోసుకొని..


Also Read: ఇది ఏ తరహా లాక్‌డౌన్? కేంద్రంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కమాన్ ఇండియా అంటూ ఆయన భారతీయులందరికీ పిలుపు ఇచ్చారు. మనం మిగిలిన దేశాలకంటే బాగా చేస్తున్నాం... ఆ రేఖను మనం నేలమట్టం చేసేద్దాం’ అంటూ పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్స్ అంతా స్పందిస్తున్నారు. మనదేశం విధించిన లాక్ డౌన్ మనల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ మాత్రం... ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేస్తే గనుక పరిస్థితులు ఘోరంగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తాడు. కొందరు నీ వెంట మేమున్నామన్నా అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.