యాప్నగరం

కరోనా: హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ ఎండీలకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

Coronavirus: కర్ణాటకలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజా రవాణా సాధనాల్లో ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ జాతీయ మీడియా సంస్థ ట్వీట్ చేసిన ఫోటోను రీ ట్వీట్ చేశారు.

Samayam Telugu 4 Mar 2020, 10:03 am
హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంత్రి కేటీఆర్ కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా నగరంలో ప్రధాన రవాణా సాధనాలైన ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ, మెట్రో ఎండీలను కోరారు. బుధవారం ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తరచూ తాకే భాగాలను బాగా శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు.
Samayam Telugu B91BB5CE-33F2-4D98-A1BB-1FFC7ED08967


Also Read: కరోనా లక్షణాలతో మరో ముగ్గురు.. అపోలో ఆస్పత్రి సిబ్బంది కూడా గాంధీకి తరలింపు

Must Read: హైదరాబాద్: కరోనా సోకిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో పరీక్షలు ఎందుకు చేయలేదంటే..?

కర్ణాటకలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజా రవాణా సాధనాల్లో ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ జాతీయ మీడియా సంస్థ ట్వీట్ చేసిన ఫోటోను రీ ట్వీట్ చేశారు. బెంగళూరు మెట్రో పాలిటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులన్నింటినీ శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బస్సుల్లో లోపలి భాగం ప్రయాణికులు పట్టుకొనే డోర్ హ్యాండిల్స్, ఇతర ఇనుప భాగాలను రోజూ శుభ్రం చేయాలని సూచించింది. వీటిని క్లోరిన్, ఆల్కహాల్ ఆధారిత ద్రావణాలతో శుభ్రం చేయాలని సూచించింది.

Also Read: కరోనా కలకలం: హైదరాబాద్‌లో ఆ 61 స్కూళ్ల పిల్లలకు వైద్య పరీక్షలు

నగరంలో కరోనా వైరస్ కేసు బయటపడడంతో పాఠశాల విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది. విద్యార్థుల్లో అవగాహన కల్పించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని అన్ని పాఠశాలలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను బుధవారం నుంచి ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.


Also Read: ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఆ విద్యార్థుల భవిత ప్రశ్నార్థం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.