యాప్నగరం

KTR: టీఆర్‌ఎస్ మంచి మెజార్టీతో గెలుస్తుంది.. నాకు నమ్మకముంది

TRS: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి గౌరవప్రదమైన మెజార్టీ దక్కుతుందని పేర్కొన్నారు.

Samayam Telugu 21 Oct 2019, 8:58 pm
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం ఖాయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత నెల రోజులుగా హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీఆర్‌ఎస్ నాయకులకు, క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu huzurnagar


హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల నుంచి తనకు అందిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని కేటీర్ పేర్కొన్నారు. ఆయనకు గౌరవప్రదమైన మెజార్టీ దక్కుతుందని వెల్లడించారు.

Also Read: అక్క మీద కోపంతో కుక్కను చంపేశాడు.. హైదరాబాద్‌లో దారుణం

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి సోమవారం (అక్టోబర్ 21) ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో పోలింగ్‌ జరిగింది. హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే కొనసాగింది. టీఆర్‌ఎస్ తరపున సైదిరెడ్డి కాంగ్రెన్‌ నుంచి పద్మావతి ఉత్తమ్ రెడ్డి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు బరిలో నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.