యాప్నగరం

కేటీఆర్ మెచ్చిన మహిళా సర్పంచ్.. ఏం చేశారంటే

Mahabubabad జిల్లాలో కరోనా కట్టడికి ఓ మహిళా సర్పంచ్ మరో ముందడుగు వేశారు. పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా రసాయనాలు పిచికారి చేశారు. ఆమె అందరికీ స్ఫూర్తిదాయకం అని మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.

Samayam Telugu 8 Apr 2020, 1:13 pm
ఊరి సర్పంచ్ ఆ ఊరి కథానాయకుడు కావాలి. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కథానాయకుడు కావాలి. కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఇది. కేసీఆర్ పిలుపు అందుకొని పలువురు ప్రజా ప్రతినిధులు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు.
Samayam Telugu sarpanch


ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్ మరో అడుగు ముందుకేశారు. పారిశుధ్య కార్మికుల్లో స్ఫూర్తి నింపుతూ స్వయంగా స్ప్రేయర్ భుజానికి తగిలించుకున్నారు. గ్రామంలో సూక్ష్మజీవులను నశింపజేసే రసాయనాలు చల్లి వారి విలువైన సేవలకు ఈరకంగా గౌరవం సమర్పించారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట్ మండలం గోపతండా సర్పంచ్ అజ్మీరా లక్ష్మిని సిటిజన్ హీరోగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కోవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టడానికి పారిశుధ్య కార్మికులను ఆమె ముందుండి నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఈ యువ సర్పంచ్ అందరికీ ఆదర్శమని కితాబిచ్చారు.


Also Read: మేకలకు మాస్క్.. పులికి కరోనా, ఖమ్మం వాసి అలర్ట్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.