యాప్నగరం

గొప్ప అవకాశం.. త్వరగా పట్టేద్దాం.. కేంద్రానికి కేటీఆర్ కీలక సూచనలు

దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి కీలక సూచనలు చేశారు.

Samayam Telugu 1 May 2020, 9:40 am
కరోనా వైరస్‌పై పోరాటంలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్న వేళ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు కీలక సూచనలు చేశారు. దేశంలోకి పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలిపారు. భారత్‌ ముందు గొప్ప అవకాశం ఉందన్న కేటీఆర్.. దాన్ని త్వరగా ఒడిసి పట్టుకోవాలన్నారు.
Samayam Telugu కేటీఆర్


నాణ్యమైన మెషినరీ సేకరణ కోసం త్వరితగతిన రుణాలు మంజరు చేయాలని, సిబ్బందికి అంతర్జాతీయ శిక్షణ అందించాలని, ఎగుమతులపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించాలని గోయల్‌కు కేటీఆర్ సూచించారు.

ఎస్ఎంఈలకు బెయిలవుట్‌తోపాటు తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లోని ఎస్ఎంఈలకు నేరుగా ఆర్థిక సాయం అందించాలని, ఇతర రంగాలకు ఉదారంగా రుణం ఇవ్వాలని.. బకాయిలను వాయిదా చేయాలని కేటీఆర్ సూచించారు. పెట్టుబుడుల అవకాశాలను గుర్తించి, ఫాలోఅప్ చేయడం కోసం ఎంపవర్డ్ స్ట్రాటజీ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.