యాప్నగరం

ట్విటర్‌లో మరో మైలు రాయిని చేరుకున్న మంత్రి కేటీఆర్

KTR in twitter: 2010 ఏడాది మార్చిలో కేటీఆర్ ట్విటర్‌ ఖాతాను తెరిచారు. వర్తమాన రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులతోపాటు అనేక అంశాలపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ వస్తున్నారు.

Samayam Telugu 2 Apr 2020, 8:39 pm
ట్విటర్‌లో ఎప్పుడూ చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్ ఆ మాధ్యమంలో మరో మైలు రాయిని చేరుకున్నారు. ట్విటర్‌లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య 20 లక్షలకు (2 మిలియన్)కు చేరింది. ప్రస్తుతం కేటీఆర్ మంత్రి గానే కాకుండా టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలెవరైనా సమస్యతో ఆయనకు ట్వీట్ చేస్తే దానికి కచ్చితంగా స్పందిస్తుంటారు. ఇటీవల కరోనా వల్ల అమలు చేయాల్సి వస్తున్న లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ చాలా మంది నెటిజన్లు తమ సమస్యలను మంత్రి కేటీఆర్‌తో పంచుకున్నారు. ప్రతి ఒక్కరికీ మంత్రి తన కార్యాలయం ద్వారా సాయం అందిస్తున్నారు. ట్విటర్ ద్వారా సాయం కోరే ఎంతో మందికి కేటీఆర్ పేరు పేరునా రోజూ స్పందిస్తుంటారు.
Samayam Telugu ktr


Must Read: కేసీఆర్ సమీక్షకు డిప్యూటీ సీఎంకు నో ఎంట్రీ.. కారణాలేంటంటే..!

2010 ఏడాది మార్చిలో కేటీఆర్ ట్విటర్‌ ఖాతాను తెరిచారు. వర్తమాన రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులతోపాటు అనేక అంశాలపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ వస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో కేటీఆర్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య పది లక్షలు (1 మిలియన్) దాటింది. కేవలం రెండేళ్లలోనే ఆ సంఖ్య రెట్టింపు కావడం విశేషం. దీంతో తెలంగాణ నుంచి రాజకీయ నాయకుల్లో అత్యధిక మంది ఫాలో అయ్యే వారిలో కేటీఆర్ నిలిచారు.

Must Read: లాక్ డౌన్‌పై తెలంగాణ పోలీసుల పోల్.. షాకింగ్ వాస్తవాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.