యాప్నగరం

కరోనాపై రాహుల్ సిప్లిగంజ్ ఉర్రూతలూగించే పాట.. విడుదల చేసిన కేటీఆర్

Coronavirus Song: ఈ గీతాన్ని కందికొండ రచించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ఆవిష్కరణ సంందర్భంగా గీతాన్ని విన్న మంత్రి కేటీఆర్.. దీనివల్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కలుగుతుందని అన్నారు.

Samayam Telugu 28 Apr 2020, 5:20 pm
కరోనా వైరస్‌ వల్ల తలెత్తుతున్న పరిస్థితులపై రూపొందించిన ఓ ప్రత్యేక పాటను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో ప్రధానంగా సేవలందిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది సేవల్ని గుర్తు చేస్తూ బొంతు శ్రీదేవి ఈ పాటను రూపొందించారు. మంగళవారం ఈ పాటను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ గీతాన్ని కందికొండ రచించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ఆవిష్కరణ సంందర్భంగా గీతాన్ని విన్న మంత్రి కేటీఆర్.. దీనివల్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కలుగుతుందని అన్నారు. కరోనాపై చైతన్యం కలిగించేందుకు చొరవ చూపి పాటను నిర్మించిన హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి శ్రీదేవికి మంత్రి అభినందనలు తెలిపారు.
Samayam Telugu EWrftBDVcAE9Ks6


Also Read: undefined

మరోవైపు, గజ్వేల్‌లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తెలంగాణలో సోమవారం కేవలం 2 కరోనా కేసులే నమోదయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. మరిన్ని రోజులు లాక్‌డౌన్‌కు సహకరించి కరోనాను తరిమికొట్టాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

Also Read:షాకింగ్.. తెలంగాణలో కోటిన్నర లీటర్ల బీరు మురుగు కాల్వలోకి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.