యాప్నగరం

కరోనా రెడ్ జోన్‌లో మంత్రి కేటీఆర్.. ఇంటింటికీ వెళ్లి..

Rajanna Sircilla Coronavirus: కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన 21 మందిని క్వారంటైన్‌‌లో చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో 21 మందిని ఇంటికి పంపి హోం క్వారంటైన్‌లో ఉంచుతామని వివరించారు.

Samayam Telugu 15 Apr 2020, 5:58 pm
Samayam Telugu EVoof1rUcAEZy2b.
కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని, రాబోయే రెండు వారాలు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ సహా ప్రాంతాలలో మంత్రి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడ కంటైన్మెంట్‌ ప్రాంతం సహా, ముస్తాబాద్‌ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... గ్రామాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశామని అన్నారు. మర్కజ్‌ ఘటన లేకపోయి ఉంటే జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఉండేది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. వేములవాడలో ఒక్క కేసు మాత్రమే వచ్చిందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో కంటైన్మెంట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

Must Read: undefined

కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన 21 మందిని క్వారంటైన్‌‌లో చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో 21 మందిని ఇంటికి పంపి హోం క్వారంటైన్‌లో ఉంచుతామని వివరించారు. వేములవాడలో 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. కరోనా సోకిన యువకుడి ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు. కరోనాకు ఒక ఫార్మూలా అంటూ ఏమీ లేదని, సోకకుండా చూసుకోవడమే మందు అని అన్నారు.

Also Read: undefined

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు ఉన్న లబ్దిదారులకు రూ.1,500 ఖాతాల్లో వేసినట్లు వెల్లడించారు. వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 55 శిబిరాలు ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రాల్లోనూ వారికి శిబిరాల ఏర్పాటు చేశామని చెప్పారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.