యాప్నగరం

2020లో సెలవులివే.. ప్రకటించిన ప్రభుత్వం

ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవుల రోజున నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవులు దక్కుతాయి. కార్మికశాఖ శుక్రవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Samayam Telugu 21 Dec 2019, 9:23 am
2020 ఏడాదిలో పర్వదినాలు, జాతీయ సెలవులను తెలంగాణ కార్మికశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా దుకాణాలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ రోజుల్లో జీతంతో కూడిన సెలవులు లభించనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu telangana-logo


Also Read: AP Capital: లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కార్మికశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2020 సంవత్సరంలో వరుసగా సెలవు దినాలు జనవరి 15 బుధవారం సంక్రాంతి, జనవరి 26 ఆదివారం రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 22 శనివారం మహా శివరాత్రి మరుసటి రోజు, మే 1 శుక్రవారం సందర్భంగా మేడే సెలవు, జూన్‌ 2 మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మే 25 సోమవారం రంజాన్‌, ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబరు 2 శుక్రవారం గాంధీ జయంతి, అక్టోబరు 25 ఆదివారం దసరా పండుగ సందర్భంగా జీతంతో కూడిన సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: ఏపీకి మూడు రాజధానులపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అన్ని సంస్థలు, తమ ఉద్యోగులకు ఈ రోజుల్లో విధిగా సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి జీతం కూడా చెల్లించాలి. నిరంతరం కార్యకలాపాలు సాగాల్సి ఉన్న సంస్థల్లో సెలవు రోజుల్లో పని చేసిన వారికి అదనపు సెలవు, లేదా ఆ రోజుకు రెట్టింపు వేతనం వంటి సదుపాయం యాజమాన్యాలు కల్పిస్తున్నారు.

Also Read: డెలివరీ సమయంలో శిశువు తల కోసేసి.. డాక్టర్ అంతులేని నిర్లక్ష్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.