యాప్నగరం

సిరిసిల్ల: బావిలో పడ్డ చిరుత పులి.. సందిగ్ధంలో అటవీ అధికారులు!

Rajanna Sircilla: బావిలోకి దిగేందుకు ఏ విధమైన మెట్లు లేకపోవడంతో వల వేసి దాన్ని బయటకు తీయాలా లేదా మత్తు మందు ఇచ్చి చిరుతను బయటకు తీసుకురావాలా అనే విషయంలో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు.

Samayam Telugu 13 Jan 2021, 3:40 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వచ్చిన చిరుత పులి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించే పనిలో పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి సమయంలో చిరుత పులి పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Tiger


వారు బావి వద్దకు చేరుకొని రెస్క్యూ టీం ద్వారా పులిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. బావిలోకి దిగేందుకు ఏ విధమైన మెట్లు లేకపోవడంతో వల వేసి దాన్ని బయటకు తీయాలా లేదా మత్తు మందు ఇచ్చి చిరుతను బయటకు తీసుకురావాలా అనే విషయంలో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు.

చిరుత పులి బావిలో పడ్డ సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల జనం దాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టాలని, అప్పుడే తాము ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని వారు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

Must Read

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.