యాప్నగరం

బోనులో చిక్కిన చిరుత.. భారీగా పోలీసుల బందోబస్త్

గత కొన్ని రోజులుగా చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోది. దీంతో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు.

Samayam Telugu 11 Oct 2020, 9:38 am
ఎట్టకేలకు రాజేంద్రనగర్‌లో కలకలం రేపిన చిరుతకు అటవీ శాఖ అధికారులు చెక్ పెట్టారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు అటు పోలీసులు, ఇటు అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. రాజేంద్ర నగర్‌లోని వాలంతరి ఫామ్ లాండ్ లో చిరుత కోసం ఏర్పాటుచేసిన బోనులో చిరుత పులి చిక్కింది. దీంతో దాన్ని పట్టుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన అటవీశాఖ అధికారులు. మీడియాను కూడా అనుమతించడం లేదు పోలీసులు.
Samayam Telugu leopard trapped in cage at rajendra nagar
బోనులో చిక్కిన చిరుత.. భారీగా పోలీసుల బందోబస్త్


కొన్ని నెలలుగా చిరుత ఇక్కడే సంచరిస్తూ దాడులకు పాల్పడుతుంది. శనివారం వాలంతరి ఆవరణలో ఓ పశువుల పాకలో ఆవు దూడలపై దాడి చేసింది. రెండు దూడలను చంపింది. తెల్లవారుజామున పాక వద్దకు వచ్చిన యజమాని చనిపోయిన దూడలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారులకు తెలిపాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Read More: ములుగులో మావోల ఘాతుకం.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

చనిపోయిన దూడలను ఎరగా అక్కడే ఉంచారు. రెండు నెలల క్రితం ఇదే పాకలో ఓ దూడను చిరుత చంపేసిన విషయం తెలిసిందే. అప్పట్లోనూ పట్టుకొనేందుకు అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ చిరుతను బంధించలేకపోయారు. అప్పటి నుంచి జాడ లేకుండాపోయిన చిరుత పదిరోజుల క్రితం బుద్వేల్‌ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు చేరుకొని స్థానికులను అప్రమత్తం చేశారు. దీంతో ఇవాళ పక్కా ప్లాన్ రచింది బోనులో చిరుత చిక్కే విధంగా ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.