యాప్నగరం

వరదసాయం పంపిణీకి వెళ్లిన మేయర్.. అడ్డుకున్న స్థానికులు

చర్లపల్లి డివిజన్‌లో పర్యటించిన మేయర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మేయర్‌ను అడ్డుకున్న స్థానికులు వరద సాయంపై నిలదీశారు.

Samayam Telugu 15 Nov 2020, 11:58 am
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. చర్లపల్లి డివిజన్‌లో వరద సహాయం పంపిణీకి మేయర్ బొంతు వెళ్లారు. అయితే అక్కడ ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా తమ వద్దకు వచ్చారా? అంటూ జనం నిలదీశారు. తమ డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని కాలనీ వాసులు మేయర్ బొంతు రామ్మోహన్‌ను నిలదీశారు. వరద సాయం కూడా తమకు సరిగా అందలేదని మేయర్ వద్ద స్థానికులు ఆరోపించారు. దీంతో మేయర్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Samayam Telugu జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
ghmc mayor bontu ram mohan


Read More: చిరంజీవి క్వారంటైన్‌లో ఉండాలి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం ఉదయం చెర్లపల్లి డివిజన్‌కు వెళ్లగా.. ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల వర్షాల అనంతరం పర్యటించిన నాయకుల్ని, కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, మంత్రుల్ని స్థానికులు అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్‌తో కూడా జనం కొన్నిచోట్ల వాగ్వదానికి దిగారు. దీంతో వారికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.